Sunday, March 20, 2011

...the story begins

Girls అంటే - Angels
Boys అంటే - ?
Men Are From Mars, Women Are From Venus
...it is im-possible to live together!!!
ఇది నిజమా? కాదా?...
ఇది...విత్తు ముందా? చెట్టు ముందా?...కన్నా భయంకరమైన puzzle!
వేరు, వేరు జాతుల జీవులు పక్క, పక్కన కలిసి జీవించవచ్చేమో...
కానీ, ఒకటిగా కలిసి ఉండటం No సాధ్యం!
నాకు తెలిసీ...ఆడా, మగా...ఆదాం, అవ్వల దగ్గర్నించీ వేరు, వేరు జాతులే!
మరి ఈ ఒకటిగా జీవించడం, develop కావడం ఏంటో...అర్థం కాదు.
దీన్ని గురించీ logical గా కానీ, biological గా కానీ research చెయ్యలేం...అనుకుంటా...
అందుకే ఈ కథనాన్ని కథగా కదిలించి చూద్దాం.

అందుకు మనకు కావలసిందల్లా ఓ జంట.
ఎక్కడ చూసినా గొడవపడుతూ "జంట" అనే పదానికి సార్థకత తెచ్చిన...
ఎందరో కలిసిన, కలగలిసిన రెండు పాత్రలను మన
నాయికా, నాయకులుగా తీసుకుంటే,...మీకేమీ అభ్యంతరం ఉండదనుకుంటా....
...వాళ్లే కల్పన, కల్పిత్!
కల్పన, కల్పిత్ లు అందమైన జంట.
ఇద్దరూ స్నేహితులు.
ఒకర్ని ఒకరు ఎంతో ప్రేమించుకున్నారు.
ఎంతో కస్టపడి ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
Made For Each Other అనే praiseని అందరూ పెద్దగా పట్టించుకోవడం మానేసిన periodలో...
రూపంలో, ప్రేమలో, గుణ, గణాలలో Made For Each Otherగా అందర్నీ ఆకర్షించీ, అలరించీ
మళ్లీ Made For Each Otherకి సరి కొత్త popularity తెచ్చారు.
కొత్తగా ఊహ వచ్చిన ప్రతి పిల్లా, పిల్లాడూ...
కల్పన, కల్పిత్ ల లా ప్రేమించుకునీ పెళ్లాడాలని,
తమకు అట్టాంటి సరి జోడీనే దొరకాలని కలలను,
కనుల మాటున భద్రంగా దాచుకున్నారు.

సీతాకోక చిలుకలకంటే...
అందమైన పూల తోటలు ఉంటాయి ప్రేమ విహారాలు చేయడానికి...
కానీ, భూలోకంలో మనుష్యులకు సమాజం మాత్రమే ఉంటుంది.
మనుష్యులకు ప్రేమికులుగా ఉండే పదవీ కాలం చాలా తక్కువ.
ఆ కాస్త గంధర్వ మనోహరం ముగిశాక...నిజ జీవితం జీవించాల్సిందే!
కల్పన, కల్పిత్ లైనా అంతే.
శాశ్వతంగా సీతాకోక చిలుకల్లా ఉండాలని
ఎంతో consciousగా వాళ్ళిద్దరూ చేసుకున్న బాసలు...
ఎన్నో ప్రాపంచిక విషయాల కింద మూలకు పడ్డాయి.

గొంగళి పురుగుకు రెక్కలు వస్తే ఆనందం!
సీతాకోక చిలుక అయ్యాక...
గొంగళి పురుగుగా ముసుగు వేసుకోవలసి వస్తే...
ఆ చేదు అనుభవం అనే భావానికి అంతకన్నా వికారమైన పేరు లేదు.
సమాజంలో జీవితం ప్రారంభించిన కల్పన, కల్పిత్ లకు కూడా
ఈ అనుభవాలు ఎదురు అవ్వనే అయ్యాయి.

ఆటా, పాటగా సాగిన జీవితం...
పనీ, పాటగా పరిణామం చెందీ...మెల్లగా పని మాత్రమే మిగిలింది.
ప్రేమ మాత్రమే ఉన్న వారి మధ్యకు ఎన్నో విషయాలు వచ్చి చేరాయి.
ధనం, సంపద, సంపాదన, ఖర్చులూ, పనులు, పద్దులూ-హద్దులూ,
business-gusiness, career-gireer...
వీటితో పాటు సమాజం నుండీ వారసత్వంగా కల్పిత్ కు...
మగాడు అన్న బరువైన బాధ్యత వచ్చి నెత్తిన పడ్డది.
Business లో side business లా FRIENDS అనే బ్రహ్మ పదార్థాలు తోడయ్యాయి కల్పిత్ కు.
ఇక, కల్పన జీవితం బుగ్గి పాలు కావడానికి రంగం సిద్దమైయ్యింది.

వంటింటి కుందేలుగా ఉన్న నాటి స్త్రీకి లేని, రాని, రాలేని సరికొత్త సమస్య...
భాగస్వామ్యం! ఇది కొత్త స్త్రీల హృదయాలను పీడించే పాత సమస్య.
స్త్రీ ప్రతి విషయంలో తన పాలు పంచుకోవాలనుకుంటుంది.
కానీ మగాడికి తన బీర్ ఫ్రెండ్స్ తోనే పంచుకునే అలవాటయ్యింది.
ఇక బీర్ తో పాటు కెరీర్, లైఫ్, వైఫ్...అన్ని కబుర్లు, కాల...క్షేపం...అక్కడే అవుతుంది!!!
మరి ఇక్కడా...???
అందుకే పెళ్లిల్లు పెటాకులవుతున్నాయి.

ఎంత మంది అన్యోన్యంగా ఉంటున్నారు?
ఎన్ని జంటలు కలిసుంటున్నాయ్?
ఎంత మంది లైట్ తీసుకుంటున్నారు?
ఎంతమంది సర్దుకుపోతున్నారు?
ఎంతమంది compromise అవుతున్నారు?
మరెంతమంది విడిపోతున్నారు?
ఎన్ని రకాల problems తో విడిపోతున్నారు?
ఎంత ప్రేమ? ఎంత ఇగో? ఎంత ఓర్పు? ఎంత కోపం? ఎంత అసహాయత?.....

....ఇవన్నీ పక్కన పెడితే...
కలవటమూ, విడిపోవటముల మధ్య...కలిసుండటం అనే దాంట్లో...
ఎంత ఘర్షణ నేటి తరం అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలి!
అందుకే...కల్పన, కల్పిత్ ల కథ వినాలి.
వీరు కడ వరకు కలిసుంటారా?, విడిపోతారా?...అనేది కాదు మన కథ
Climax తో మనకు పని లేదు.
యాత్ర...ఎలా కొనసాగుతుందనేదే...కొత్త చరిత్ర!
Let us read this couple's diary.................